ఎన్నికల ఎఫెక్ట్….. వాయిదా పడనున్న ప్రభాస్ కల్కి సినిమా…?

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ ..వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో వచ్చి ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి చిత్రాలు మే 9 న రిలీజై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి.దీంతో సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాని మే 9 న 2024లో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.ఇక తాజా పరిణామాలు చూస్తుంటే ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం మే 9న రిలీజ్ అనుకోగా,తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో మేకర్స్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఎన్నికల వేడి తీవ్రంగా ఉన్న సమయంలో భారీ బడ్జెట్ సినిమాను విడుదల చేయకపోవడమే ఉత్తమమని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది .ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news