ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను హైకోర్టులో పిటిషన్ వేయడంతోనే రాష్ట్రంలో మేలో ఎన్నికలు జరుపుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ‘నేను ప్రపంచంలోనే 8వ వండర్ ఆఫ్ వరల్డ్. ఎవరికీ బోయింగ్ 747 లేవు. నేను సాధించా అని తెలిపారు. లక్షల మంది అనాథలను పోషించా. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎందుకు అమ్ముతున్నారని నేను ప్రశ్నించడంతో.. అది ఆగింది అని తెలిపారు. ఎన్నికలు కూడా ఏప్రిల్లో జరగకుండా నేను ఆపాను’ అని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.
కాగా, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్.ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రంలో మే 13 న ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.