వైఎస్సార్ సంకల్పాన్ని నిలబెట్టేటోల్లే వై.ఎస్.వారసులు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్టణంలో నిర్వహించిన సభలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. మనం తెలుగు వాళ్లం.. మన హక్కుల కోసం అన్నదమ్ముల్లా కొట్లాడుదాం అన్నారు. ఢిల్లీ సుల్తాన్ లు వచ్చినా.. జాగీర్దార్లు వచ్చినా.. తెలుగు గడ్డ మీద ఇటుక కూడా తీయలేరు. విశాఖ ఉక్కును కదిలించలేరు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లు అయినా పోలవరం పూర్తి కాలేదు. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి దాపురించింది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు.
ఉమ్మడి ఏపీలో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, వైఎస్ఆర్, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు వంటి వారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఖ్యాతిని తీసుకొచ్చిన వారు అని పేర్కొన్నారు. ఢిల్లీని అడిగి సాధించే నాయకత్వం లేదన్నారు. కేవీపీ రాంచంద్రావు కాంగ్రెస్ సాక్షి.. ఎన్టీఆర్ ప్రభావంలో 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదని గుర్తు చేశారు. అప్పట్లో వైఎస్సార్ చేతికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించి.. 26 సీట్లతో మొదలైన ప్రయాణం.. 1999లో ప్రధాన ప్రతిపక్షం అయింది. 2004లో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. 2009లో కూడా వైఎస్సార్ విజయదుందుబి మోగించారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రతోనే కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.