సోనూసూద్​కు బిగ్ షాక్.. కార్లు సీజ్, బయటకు రావద్దని ఆదేశాలు !

-

క‌రోనా విజృంభన వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌న దేశంలో వినిపిస్తున్న ఒకే ఒక్క‌పేరు సోనూసూద్ . ఎంతో మందికి ఈ ఆప‌ద కాలంలో ఆయ‌న అండ‌గా నిలుస్తున్నారు. ఆప‌ద‌లో ఉన్న వారికి అండ‌గా నిలిచేందుకు ఆయ‌న ఎన్నో ర‌కాలుగా సాయం అందిస్తున్నారు. అడిగింది లేద‌న‌కుండా ఆదుకుంటున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఆయ‌న నేష‌న‌ల్ రియల్ హీరోగా మారిపోయారు. ఇది ఇలా ఉంటే..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో బాలీవుడ్ హీరో సోను సూద్ కు ఊహించని షాక్ తగిలింది. ఓ పోలింగ్ బూత్ పరిశీలించి ప్రయత్నించగా సోనూసూద్ అధికారులు అడ్డుకున్నారు. సోను సూద్ కారును సీజ్ చేసి… తిరిగి ఇంటికి పంపించారు. తన సోదరి మాళవిక సూద్ మెగా స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆదివారం పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. సోనూసూద్‌ కారును సీజ్ చేయడమే కాకుండా… తన ఇంటి నుంచి బయటికి వస్తే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news