ఎన్నికలు 2023: గాడిదతో వచ్చి నామినేషన్ వేసిన ఒక నిరుద్యోగి!

-

తెలంగాణ అధికార పార్టీపై విసిగివేసారిపోయిన సామాన్యులు ఎన్నికల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక నిరుద్యోగి వినూత్న రీతిలో ఎన్నికల నామినేషన్ ను వేసి ప్రభుత్వంపై తన అసంతృప్తిని బయటపెట్టారు. పార్టీ వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీర్కూరు మండలానికి చెందిన భాస్కర్ అనే నిరుద్యోగి చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లకోసం చాలా తీవ్రంగా నిరీక్షిస్తున్నాడు. కానీ తనకు ఆశించిన విధంగా ఏమీ రాకపోవడంతో విసిగిపోయి ఈ రోజు స్వాతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి గాడిద ను తీసుకునే రిటర్నింగ్ ఆఫీస్ కు చేరుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న వారు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇతని వ్యవహారం చూస్తే ఈ ఎన్నికల్లో అధికార పార్టీని గెలవకుండా చేయడానికి పట్టం కట్టుకున్నట్లు ఉన్నాడు. కాగా ఎన్నికలు జరగడానికి ఇంకా 24 రోజులు మాత్రమే సమయం ఉంది.

సర్వే ల ఫలితాల ప్రకారం అధికార పార్టీదే విజయం అని తెలుస్తున్నా, విజయం మాత్రమే కాంగ్రెస్ కు దక్కుతుంది అంటూ ప్రజలు అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news