గద్వాల చరిత్ర చాలా గొప్పది. గద్వాలను గబ్బు పట్టించిన గబ్బు నాయళ్లు ఎవరు అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఇవాళ గద్వాల లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డను కరువు సీమగా ఆగం చేసిన పార్టీ ఏది..? వాల్మీకి బోయలు ఆంధ్రలో ఎస్టీలు.. తెలంగాణలో బీసీలు. దీనిని చెడగొట్టింది. ఆంధ్రలో ఎస్టీల కింద పెట్టి.. తెలంగాణలో బీసీల కింద పెట్టింది ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి.
ఆర్డీఎస్ కాలువను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు నష్టం జరిగింది. ఇక్కడి మంత్రులు అప్పట్లో ఎలా పని చేశారో మీకు తెలుసు అన్నారు. గద్వాలకు మెడికల్ కాలేజీ, 300 పడకలు గల ఆసుపత్రిని కల్పించామని తెలిపారు. గద్వాలలో కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.