ఏపీలోని తిరుపతిలో నిన్న అర్ధరాత్రి ఏనుగుల గుంపు భీభత్సం సృష్టించింది. చంద్రగిరి మండలం మామిడి మానుగడ్డలోని పంట పొలాల్లోకి ఏనుగుల గుంపు ఒక్కసారిగా చొరబడ్డాయి. ఆ గుంపును గమనించిన గ్రామస్థులు అప్రమత్తమై ఏనుగులను తరిమికొట్టేందుకు పొలాల వైపునకు మళ్లారు.దీంతో ఏనుగుల గుంపు గ్రామస్తులు వైపు ఒక్కసారిగా దూసుకొచ్చింది.
అది గమనించిన గ్రామస్తులు అందరూ పరుగులు తీయగా.. కందుల వారి పల్లి ఉపసర్పంచ్ రాకేష్ చౌదరి కిందపడిపోయాడు. దీంతో ఏనుగులు అతనిపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఉప సర్పంచ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు.