కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో 1962లో ప్రారంభించిన లైబ్రరీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.దాని స్థానంలో నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకు స్థానిక జయశంకర్ మినీ క్రీడా మైదానంలో తాత్కాలికంగా రెండు గదులను కేటాయించి అక్కడకు మార్చారు. నూతన భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని.. శంకుస్థాపన చేసి ఏడాది గడుస్తోందని లైబ్రరీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
మైదానానికి వందల సంఖ్యలో క్రీడాకారులు వస్తుండటంతో లైబ్రరీకి వచ్చేవారి ఏకాగ్రత దెబ్బతింటోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.తాజాగా దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.‘విజ్ఞానాన్ని పెంచి ఉజ్వల భవిష్యత్తును అందించే లైబ్రరీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నది.బాన్సువాడలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. ఏడాది గడుస్తున్నా నిర్మాణ పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. లైబ్రరీని మార్చిన చోట ఇరుకు గదుల్లో ఉద్యోగార్థులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వం వెంటనే నూతన లైబ్రరీ భవన పనులు ప్రారంభించాలి’ అని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.