అపరకుబేరుడు.. టెస్లా కార్ల సంస్థ, స్పెస్ ఎక్స్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ కు భారత్ లోని పలు రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండంటూ.. పలు రాష్ట్రాలు మంత్రులు ఆహ్వానిస్తూ.. ట్విట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలంటూ ఇప్పటికే ఎలాన్ మస్క్ కు ట్విట్ చేశారు. తాజాగా కర్ణాటక రాష్ట్రం కూడా ఈ జాబితాలో చేరింది. ‘‘400 కంటే ఎక్కువ R&D కేంద్రాలు, 45+ EV స్టార్టప్‌లు & బెంగుళూరు సమీపంలో ఒక EV క్లస్టర్, కర్నాటక భారతదేశానికి EV హబ్‌గా ఉద్భవించింది’’ అంటూ..కర్ణాటక భారీ మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి మురుగేష్ ఆర్ నిరాణి ట్వీట్ చేశారు.
ఇటీవల భారతదేశంలో ఎప్పుడు టెస్లాను ప్రారంభిస్తారని.. ఓ నెటిజెన్ ట్విట్ చేయగా…భారతదేశంలో తన ఉత్పత్తులను ప్రారంభించేందుకు ప్రభుత్వంతో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని మస్క్ ఇటీవల ట్వీట్ చేశారు. ఇప్పటికీ ప్రభుత్వంతో చాలా సవాళ్లను ఎదుర్కొంటూ పని చేస్తున్నాను అని ఎలాన్ మస్క్ అన్నారు. దీంతో ఇది కేంద్ర, రాష్ట్రాల వివాదంగా మారింది. కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ.. పలు రాష్ట్రాలు ఎలాన్ మస్క్ ను పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి.