ఏలూరు: పెరుగుతున్న బాధితుల సంఖ్య.. క్షణక్షణం భయం.. భయం..!

-

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి విలయతాండవం చేస్తుంది. దీంతో ఏలూరు వాసులలో అలజడి రేపుతోంది. ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందా అన్న అనుమానం ఏలూరు వాసులలో భయాందోళనకు కారణమౌతుంది. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే జబ్బు కాదు అని మాత్రం వైద్య నిపుణులు చెబుతున్నారు.

eluru

ఇక పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంతో పాటు సమీపంలోని దెందులూరు, ఆ చుట్టుప్రక్కల గ్రామాలను వింత వ్యాధి కలవరపెడుతోంది. ప్రస్తుతం వింత వ్యాధిగ్రస్తుల సంఖ్య 571కి చేరింది. మొత్తం 468 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 72 మందికి చికిత్స పొందుతున్నారు. రోగుల్లో 1 నుంచి 12 సంవత్సరాల మధ్య వారు 75 మంది ఉన్నారు. ఇందులో బాలురు 45, బాలికలు 30 మంది ఉన్నారు. 12 నుంచి 35 ఏళ్ల మధ్యవారు 311 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 153మంది, మహిళలు 158 మంది ఉన్నారు. 35 ఏళ్లకు పైబడిన వారు మొత్తం 185 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 101, మహిళలు 84 మంది ఉన్నారు.

ఇక ఎయిమ్స్ బృందం రోగులను నుంచి శాంపిల్స్ సేకరించింది. కూరగాయల్లో రసాయనాలు, పాల కల్తీయే కారణమని ఎయిమ్స్ నిపుణుల అంచనాకు వచ్చారు. రోగుల వెన్నుముక నుంచి తీసిన నమూనాలపై చేసిన కల్చర్ పరీక్షల ఫలితాల్లోనే నెగిటివ్ వచ్చింది. బాధితుల శరీరాల నుంచి తీసిన శాంపిల్స్ లో నికెల్ , సీసం అవశేషాలు అధికంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అసలు ఈ వ్యాధికి గల కారణాలు ఏంటన్న దానిపై శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఏదేమైనా అసలు ఏలూరు లో ఏం జరుగుతుంది.. వింత వ్యాధికి కారణం ఏంటి అన్న ఉత్కంఠ మాత్రం ఏలూరు వాసులకు ఇంకా కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news