పటాన్‌చెరు కాంగ్రెస్ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ బార్య సుధారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు చెంప పగలకొడతా అని మంత్రి కొండా సురేఖ ముందే కాటా సుధారాణి అన్నారు.
నా భర్తను నన్ను అనే హక్కు ఎవరికీ లేదని మేము తప్పు చేయలేదని అటువంటి మాపైన ఇలా ఇష్టం వచ్చినట్లు మాటలు అనడం సరికాదని,నీలం మధు చెంప పగలకొట్టాలి అనుకున్న.. నీలం మధుకి కామన్ సెన్స్ లేదు అంటూ మంత్రి కొండా సురేఖ ముందు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి నీలం మధుని అవమానించింది. లీడర్ కి ఉండవలసినవి ఎథిక్స్ అని అందరి ముందు మెదక్ ఎంపీ అభ్యర్థిని ఘోరంగా అవమానించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.