కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాపై కొత్తగా అమలు చేయనున్న నిబంధనల వల్ల ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు మంగళం పాడనున్నారా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ వల్ల యూజర్ల డేటాకు భద్రత ఉంటుంది. అయితే కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలను అమలు చేయాలంటే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండకూడదు. దీంతో ఆయా యాప్‌ల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి.
కేంద్రం అమలు చేయనున్న కొత్త నిబంధనల కారణంగా సోషల్ మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. ఈ క్రమంలోనే ఫేక్ న్యూస్‌ను మొదటగా ఎవరు సృష్టించారు ? అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ న్యూస్‌ను పెట్టేవారిని 36 నుంచి 72 గంటల్లోగా ట్రేస్ చేయాలి. అయితే ఈ విధంగా చేయాలంటే ఆయా యాప్ లలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండకూడదు. దీంతోనే ఫేక్ న్యూస్‌ను మొదట ఎవరు సృష్టించారు అనేది తెలుసుకునేందుకు సోషల్ మీడియా సంస్థలకు వీలవుతుంది. కానీ ఇలా చేస్తే యూజర్ల డేటాకు సెక్యూరిటీ, ప్రైవసీ ఉండదు. దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి ? అని సోషల్ మీడియా సంస్థలు తీవ్రంగా ఆలోచిస్తున్నాయి.
అయితే వాస్తవానికి మెసేజింగ్ యాప్‌లలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఉండాలి. లేదంటే యూజర్ల డేటాకు ముప్పు ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే కేంద్రం తెచ్చిన కొత్త రూల్స్ ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. వాటి వల్ల యూజర్ల డేటాకు రక్షణ లేకుండా పోతుందని అంటున్నారు. అయినప్పటికీ కేంద్రం దీనిపై ముందుకు వెళ్లేందుకే సిద్దమవుతోంది. మరి ఈ విషయంపై ఏం జరుగుతుందో చూడాలి.