జాక్వెలిన్ ఫెర్నండెజ్‌కు ఈడీ సమన్లు

మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 8న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించడంతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ముంబయి ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ముంబయి మీదు దుబాయి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించింది.

రూ. 200కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు కన్మన్ సుఖేశ్ చంద్రశేఖర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటంతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. సుఖేశ్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగినందుకు జాక్వెలిన్‌కు రూ.కోట్ల బహమతులు అందుకున్నట్లు సమాచారం.

సుఖేశ్, జాక్వెలిన్‌కు సంబంధించిన ఫొటో ఒక్కటి ప్రస్తుతం వైరల్ అవుతున్నది. ఆ ఫొటోలో జాక్వెలిన్‌కు సుఖేశ్ ముద్దు పెడుతుండటం గమనార్హం.

గత ఆగస్టులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. తమ పర్మిషన్‌ లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది.

విచారణలో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రూ.10కోట్ల విలువైన బహుమతులు ఇచ్చినట్లు సుఖేశ్ చంద్రశేఖర్ ఈడీ అధికారులకు వెల్లడించారు. అందులో రూ.52లక్షలు విలువ చేసే గుర్రం, నాలుగు పర్షియన్ పిల్లులు, వజ్రాల నగలు ఉన్నట్లు తెలిసింది.