ముంబై లో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా లు తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేశారు. సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ లో క్లాజెన్ 109, రీజా హెన్డ్రిక్స్ 85, జాన్సెన్ 75 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు చాలా కష్టమైన లక్ష్యాన్ని ఉంచారు. ఈ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లాండ్ ఆరంభంలోనే వరుసగా కీలక వికెట్లు అనీ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లు బెయిర్ స్టో 10, మలన్ 6, రూట్ 2 మరియు స్టోక్స్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. బ్యాటింగ్ లో రాణించిన జాన్సెన్ బౌలింగ్ లోనూ రాణించి రెండు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను దెబ్బతీశాడు. ఇతనికి రబడా మరియు ఎంగిడి ఒక్కో వికెట్ తీసి సహాయం చేశారు.
ఇప్పుడు నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలా కష్టమనే చెప్పాలి. గత వరల్డ్ కప్ టైటిల్ ను సాధించిన ఇంగ్లాండ్ కు ఈ కఠినమైన పరిస్థితులు ఏమిటో మరి చూద్దాం ఏమి జరగనుందో ? బట్లర్ పై ఇప్పుడు చాలా భారం పడనుంది.