నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. చాహ‌ల్ ఖాతాలో రెండు..

-

ఇంగ్లండ్‌- టీమిండియా మ‌ధ్య జ‌రుగుతున్న రెండో వ‌న్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జ‌ట్టు 19 ఓవ‌ర్లు ముగిసేస‌రికి నాలుగు వికెట్లు నష్టానికి 87 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజ్‌లో లియామ్ లివింగ్ స్టోన్‌, బెన్ స్టోక్ ఉన్నారు. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, హార్దిక్ పాండ్యా చెరో వికెట్‌, చాహ‌ల్ రెండు వికెట్లు తీశారు. ప్ర‌మాద‌క‌రంగా బ్యాటింగ్ చేస్తున్న జోరూట్ (11) 18వ ఓవ‌ర్‌లో కీల‌క అవుట‌య్యాడు.18 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి మూడు వికెట్లు కోల్పోయి 84 ప‌రుగులు చేసింది. 18వ ఓవ‌ర్‌లో చాహ‌ల్ వేసిన బంతిని ఆడ‌బోయిన జోరూట్ ఎల్బీ డ‌బ్ల్యూ అయ్యాడు. అంత‌కుముందు టాస్ గెలిచిన భార‌త్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న‌ది. తొలి వ‌న్డేలో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ స్థానం క‌ల్పించారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ స్థానంలో కోహ్లీ ఆడ‌నున్నాడు. పిచ్‌లో తేమ ఉంద‌ని, అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్న‌ట్లు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తెలిపాడు. ఇంగ్లండ్ జ‌ట్టు ఈ మ్యాచ్‌లో ఎటువంటి మార్పులు చేయ‌లేదు. ఇటీవ‌ల ఫామ్‌లోని కోహ్లీ తొలి వ‌న్డేలో ఆడ‌లేదు. ఇక విండీస్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌కు ప్ర‌క‌టించిన జ‌ట్టులోనూ కోహ్లీకి స్థానం ద‌క్క‌లేదు. అత‌నికి రెస్ట్ ఇచ్చారు. అయితే ఇంగ్లండ్‌తో జ‌రిగే రెండో వ‌న్డేకు మాత్రం కోహ్లీకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటివరకు చాహల్‌ ఖాతాలో రెండు వికెట్ల నమోదయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version