బిగ్ పైట్ కు మహారాష్ట్ర సిద్ధమైంది. అధికారం కోసం మహాయుతి, మహావికాస్ అఘాడియా కూటములు స్టాటజీతో పాలిటిక్స్ చేస్తున్నాయి.. నువ్వా నేనా అన్నట్లుగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.. ఈ ఎన్నికలు మహావికాస్ అఘాడియా కూటమికి జీవన్మరణ సమస్యగా మారడంతో.. నేతలు సీరియస్ గా దృష్టి పెట్టారు. బిజేపీ నేతృత్వం వహిస్తున్న మహాయుతి కూటమి మాత్రం గెలుపు ధీమాలో ఉంది.. దీంతో రెండు కూటముల మధ్య మరో పొలిటికల్ పైట్ జరగబోతుంది.. నామినేషన్ల ఘట్టం ముగియడంతో.. పార్టీలు ప్రచారాలపై పోకస్ పెట్టాయి..
మహారాష్ట్ర ఎన్నికల్లో తొలి అంకం ముగిసింది. నామినేషన్లపర్వం ముగిసింది.. మొత్తం 7వేల 995 మంది నామినేషన్లు దాఖలుచేశారు. బీజేపీ అత్యధికంగా 148స్థానాల్లో పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ 103నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో దించింది. 89 స్థానాల్లో శివసేన-ఉద్ధవ్ ఠాక్రే, 87 సీట్లలో ఎన్సీపీ-శరద్ పవార్ వర్గాలు పోటీచేస్తున్నాయి. శిందే సారథ్యంలోని శివసేన 80, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 53స్థానాల్లో అభ్యర్థులను రంగంలో దించాయి.. దీంతో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే దానిపై స్పష్టత వచ్చింది. 288 అసెంబ్లీ స్థానాలకు వచ్చె 20న పోలింగ్ జరగనుంది..
ప్రధాన కూటమితో పాటు.. 7995 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడియా మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.. మహాయుతికి సారధ్య్యం వహిస్తున్న బిజేపీ.. అత్యధికంగా 148 స్థానాల్లో నామినేషన్లు వేసింది.. అదే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో ఉన్న శివసేన 80 స్థానాల్లో, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 53 స్థానాలు పోటీ చేస్తోంది.. మరో ఐదు స్థానాలను కూటమి పార్టీలకు ఇచ్చాయి..
ప్రతిపక్ష మహా వికాస్ అఘాడియాకు సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. 103 స్ఝానాలు.. శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం 89 స్థానాలు, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 87 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.. వచ్చె నెల 4వ తేదీన ఉపసంహరణ ఉంటుంది.. 2019 ఎన్నికల్లో 5వేల543 మంది నామినేషన్లు దాఖలు చెయ్యగా.. చివరకు 3వేల239 మంది మాత్రమే బరిలో నిలిచారు. ఇప్పుడు ఎంతమంది పైనల్ పోరులో ఉంటారనేది ఇంకా స్పష్టత రాలేదు.. ప్రధాన అభ్యర్దులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో మాత్రం హైటెన్షన్ నెలకొంది.. శివసేన వర్గంతోపాటు.. ఎన్సీప్ అభ్యర్దులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.. ఈ ఎన్నికల్లో ఏ కూటమి పై చేయి సాధిస్తుందో చూడాలి..