ఝార్ఖండ్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం : డిప్యూటీ సీఎం భట్టి

-

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని స్టార్ క్యాంపయినర్ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రచార వ్యూహాలు, ఎన్నికల హామీలు, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాంచీలోని జేకే హాల్ లో సంవాద్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఝార్ఖండ్ పురోగతి కోసం వ్యూహరచన చేస్తుందని చెప్పారు.

కూటమి ఎన్నికల హామీలు, కార్యక్రమాల గురించి చర్చించడంతో పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. కార్యకర్తలందరూ సమన్వయంగా పని చేస్తే.. మనం ఝార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించడం కోసం, రాజ్యాంగ మౌళిక సూత్రాలను కాపాడటంతో పాటు దేశ వనరులను కాపాడుకోవాలంటే ఇండియా కూటమికి ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరముందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version