అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులు ఎవరు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.మంగళవారం మండలంలోని సీతారాంపురం గ్రామంలోని ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని తెలిపారు.చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.పంట నష్ట వివరాలు అధికారులు సర్వే చేస్తున్నారని నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని అన్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, గోదాములకు తరలించాలని సూచించారు. ఈ సందర్భంగా దేవరుప్పుల మండలం చిన్న మడూరు గ్రామంలో మంగళవారం జరిగిన రేణుక ఎల్లమ్మ పండుగ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. గ్రామస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్తులందరనీ చల్లగా చూడాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. సందర్భంగా మంత్రికి చిన్న మడూరు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, పాల్గొన్నారు.