ఉన్న స్కూళ్లను మూయొద్దు.. కొత్త భవనాలు ఇవ్వండి అంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఉన్న ప్రాంతాల్లో రైతులు, ప్రజలు ఆందోళన పడుతున్నారని తెలిపారు. తమ పొలాలకు, స్థలాలకు వచ్చే నష్ట పరిహారం విషయంలో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు బాదితుల సమస్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ దృష్టికి తీసుకు వెళ్ళామన్నారు.
రీజనల్ రింగ్ రోడ్డు పై సంపూర్ణ నివేదికను త్వరలోనే నితిన్ గడ్కరీకి అందిస్తామని ప్రకటించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి దృష్టికి పలు అంశాలు తీసుకు వెళ్ళామమని.. గతంలో కేంద్రం ఇచ్చిన ఇళ్లను కట్టలేకపోయారని పేర్కొన్నారు. ఎక్కువ డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని కోరామని… పేద వాళ్ళకే అందేలా విధివిధానాలు ఉండాలని కోరామన్నారు. హైడ్రా పేరిట వేలాది ఇళ్లకు.. వందలాది కాలనీలకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. అర్బన్ ఐజేశన్ లో భాగంగా ఎన్నో చెరువులు మాయం అయ్యాయి… చెరువుల్లో డ్రెయినేజీ నీళ్ళు కలిపారని వివరించారు.