రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. అదీ ఈటల రాజేందర్ దే. ఆయన ఇప్పుడు ఎటువైపు అడుగులు వేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన వేరే పార్టీలో చేరతారా లేదా ఆయనే స్వయంగా పార్టీ పెడతారా డిబేట్ల మీద డిబేట్లు పెడుతున్నారు. అయితే ఇదిలా ఉండగా.. టీఆర్ ఎస్ నుంచి కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ నేతలు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేటీఆర్ కు లేఖలు రాశారు.
ఆయన వెన్నంటే నడుస్తారనుకున్న ఉమ్మడి కరీంనగర్ టీఆర్ ఎస్ నేతలు ఇప్పుడు ఆయనపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కేటీఆర్ కు లేఖ కూడా రాశారు. అయితే దీనిపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతంలో నిజామాబాద్ నేత డి.శ్రీనివాస్ పై కూడా కవిత ఇలాంటి ఆరోపణలే చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆమె అధ్యక్షతన సమావేశం నిర్వహించిన నేతలు కేసీఆర్ కు లేఖలు రాశారు. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ శ్రీనివాస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హోల్డ్ లో పెట్టారు. ఆయన బలమైన బీసీ నేత కావడంతోనే ఆయనపై చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలతో సంబంధాలున్న ఈటలపై చర్యలు తీసుకుంటారా లేక హోల్డ్ లో పెడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈటల.. తనను బర్త్‌రప్ చేసినట్టే.. సస్పెండ్ చేసేదాకా వేచి చూస్తారని సమాచారం.