కరోనా వ్యాక్సిన్ పై మంత్రి ఈటల కీలక ప్రకటన

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది ? ఎప్పుడు మళ్ళీ జనజీవన లు మామూలు అవుతాయి అనేది. అయితే ఈ విషయం మీద ఇప్పటికీ సరైన స్పష్టత లేదు సరైన వ్యాక్సిన్ను ఎప్పటికీ అందుబాటులోకి వస్తుందని ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ సమయంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక కీలక ప్రకటన చేశారు. అయితే ఈయన కూడా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని చెప్పలేకపోయారు. తాజాగా వాక్సిన్ పై స్పందించిన మంత్రి ఈటల అనేక కంపెనీల వాక్సిన్ లు ఇండియాకు వస్తున్నాయని అన్నారు. అయితే ఎప్పటి లోపు వాక్సిన్ వస్తుంది అని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని ఆడిగామని వాళ్ళు సరయిన సమాచారం ఇవ్వలేదని ఆయన అన్నారు.

ప్రోటో కాల్స్ అన్ని పూర్తి చేస్తున్నామన్న ఆయన ఒకవేళ వస్తే ముందుగా ఫ్రoట్ లైన్ హెల్త్ వర్కర్లకు.. శానిటేషన్ సిబ్బందికి ఇస్తామని అన్నారు. అలానే బస్తీల్లో ఉన్న పేదలకు ఉచితంగా ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఇక నర్సింగ్ రిక్రూట్ మెంట్ అవకతవక లపై స్పందించిన మంత్రి ఈటల అది ఇంకా కాలేదని అన్నారు. కాంట్రాక్టు వాళ్లకు వెయిటెజ్ మార్కులు ఇస్తారని, కొందరు ఔట్ సోర్సింగ్ వాళ్ళు సర్టిఫికెట్లు తెచ్చుకున్నట్లు తెలుస్తోందని అందుకే నర్సింగ్ నియామాకాల పై విచారణకు అదేశించానని అన్నారు.