బ్రేకింగ్: సరిహద్దుల్లో లొంగిపోయిన కీలక ఉగ్రవాదులు

-

మేఘాలయ-అస్సాం-బంగ్లాదేశ్ సరిహద్దులో భారత సైన్యం ముందు కీలక ఉగ్రవాదులు లొంగిపోయారు. భారత సైన్యానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అమలు చేసిన వేగవంతమైన మరియు ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్ లో… హార్డ్కోర్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (స్వతంత్ర) నాయకుడు దృష్టి రాజ్ఖోవా లొంగిపోయారు. వేదాంత, యాసిన్ అసోమ్, రోప్జ్యోతి అసోమ్ మరియు మిథున్ అసోమ్ అనే నలుగురు సహచరులతో కలిసి ఆయన లొంగిపోయారు.

వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత తొమ్మిది నెలలుగా భద్రతా దళాలు ఉగ్రవాదులను పట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దిగువ అస్సాంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కారణమైన ఉల్ఫా ఉగ్రవాదుల కోసం చాలా కాలంగా గాలిస్తున్నారు. మిలిటెంట్ గ్రూపు సెకండ్ ఇన్ కమాండ్ అయిన రాజ్‌ఖోవా ప్రస్తుతం ఆర్మీ ఇంటెలిజెన్స్ అదుపులో ఉన్నారని, వారిని అస్సాంకు తీసుకువస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news