తెలంగాణ లో దీపావళి నిన్ననే జరిగింది : ఈటెల

హుజురాబాద్ ఉపఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర‌వాత ఈటెల రాజేంద‌ర్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ పై విర్శ‌లు కురింపించారు. కుట్ర దారుడు కుట్రల్లోనే నాశనం అవుతాడు అంటూ ఈటెల కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ నీచపు, చిల్లర పనులు చేశాడంటూ ఈటెల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయన బొమ్మ, ఆయన గుర్తు మీదనే గెలుస్తార‌న్న‌ అహంకారం ఉందని….తమకే ఓట్లు వేయాలని పసుపు బియ్యం తో ప్రమాణం కూడా చేయించుకున్నారని ఈటెల మండిప‌డ్డారు.

cm kcr etela rajender
cm kcr etela rajender

దళిత బంధు పది సార్లు ఇస్తామన్నా హుజురాబాద్ ప్ర‌జ‌లు ధ‌ర్మం వైపే నిలబడ్డారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. డబ్బులు పంచి నోళ్ళను తన్ని తరిమేశారని..దమ్ముంటే మామా అల్లుడు పోటీ చేయాలని ఈటెల సవాల్ విసిరారు. అంతే కాకుండా తెలంగాణ లో దీపావళి నిన్ననే జరిగిందంటూ ఈటెల వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్ర‌జ‌లు ఇచ్చిన విజ‌యానికి త‌న చ‌ర్మం తో చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేన‌ని అన్నారు.