రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం.. ఇక్కడ హక్కులు లేవు- ఈటెల రాజేందర్

-

రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగమే నడుస్తుందని.. ఇక్కడ హక్కులు లేవంటూ విమర్శించారు ఈటెల రాజేందర్. గెలిచిన తర్వాత తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. హుజూరాబాద్ విజయం ప్రజలకే అంకితమని ఈటెల రాజేందర్ అన్నారు. అధికారులు అంతా కేసీఆర్ కు బానిసగా పనిచేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎలా బెదిరించారో సీడీలు నా దగ్గర ఉన్నాయని.. ఆ సీడీలు ఎన్నికల కమీషన్ కు పంపిస్తా.. డీజీపీ కి కూడా ఇస్తా అన్నారు. పోలీసుల కనుసన్నల్లో డబ్బులు పంపంకం జరిగిందని దుయ్యబట్టారు. పదోన్నతుల కోసం అధికారులు తప్పటడుగులు వేశారన్నారు. మీరు తీసుకనే జీతాలు ప్రజల డబ్బు అని మరవద్దని హితవు పలికారు. ప్రజల చెమటతో పన్నులు కడితే జీతాలు తీసుకునే జీతగాళ్లు మీరని.. మీరు చేసిన పనికి తెలంగాణ జాతి తల దించుకుంటుందని అన్నారు.

కేసీఆర్ ఒక్క ఉప ఎన్నికకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తావా..? అని ప్రశ్నించారు. 2023 లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు పాతరేస్తారని..2023 లో గెలిచేది బీజేపే అని స్పష్టం చేశారు ఈటెల. కేసీఆర్ కు అధికారం తాతలు తండ్రుల నుంచి రాలేదు. కేసీఆర్ 20 ఏళ్లు పాలించమని ప్రజలు అధికారాన్ని ఇవ్వలేదు. కేసీఆర్ అధికారం 2023 వరకే ఉంటుందని ఈటెల రాజేందర్ అన్నారు. దళిత బందును రాష్ట్ర మంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడేళ్ల పాలనలో ఒక్క దళిత కుటుంబం అయినా బాగుపడిందా అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version