Bigg Boss Telugu: ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

-

రియాలిటీ షో బిగ్ బాస్.. గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షో కు ఉన్న ఫాలోయింగ్ అంతా.. ఇంతా కాదు. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని… ఐదో సీజన్ కూడా విజయవంతంగా నడుస్తోంది. గత సీజన్ తరహాలోనే ఈ సీజన్ కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఐదవ సీజన్ ప్రారంభం నుంచి చాలా రసవత్తరంగా సాగుతోంది. ప్రతి సీజన్ కు 16 మంది సభ్యులు వచ్చేవారు కానీ ఈ సారి మాత్రం ఏకంగా 19 మంది సభ్యులతో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైంది.

ఇక ఇప్పటికే ఏడుగురు సభ్యులు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మొదటి వారం సరియు… రెండో వారంలో ఉమాదేవి, ఆ తర్వాత లహరి, నటరాజు మాస్టర్, హమీదా, శ్వేత వర్మ , ప్రియ, లోబో ఇలా వరుసగా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ షో లో 11 మంది కంటెస్టెంట్ లు ఉన్నారు. ప్రస్తుతం 9 వ వారం షో నడుస్తోంది. దీంతో ఈ 9వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇక ఈ వారం కెప్టెన్ షణ్ముఖ్, హానీ మాస్టర్ మినహా అందరూ నామినేషన్ లో ఉన్నారు. ముఖ్యంగా… కాజల్, జెస్సీ, ప్రియాంక, విశ్వ.. డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే వీరందరిలో నటుడు విశ్వ కు చాలా తక్కువ ఓట్లు వచ్చినట్లు… సమాచారం అందుతోంది. దీంతో ఈ వారం బిగ్ బాస్ షో నుంచి ఈ విశ్వ ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి.. చాలా బాగా ఫర్ ఫామ్ చేసినప్పటికీ… మిగిలిన కంటెస్టెంట్ ల కంటే… తక్కువ ఓట్లు రావడం వల్ల విశ్వ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version