హింస జరిగిన తరువాత కూడా పోలీసులు స్పందించలేదు. కూటమి నేతలు ఎవ్వరినీ నియమించాలని కోరితే ఆ అధికారులను నియమించారు. కూటమి నేతలు వైసీపీ నేతలను, కార్యకర్తలను కర్రలతో, రాళ్లతో దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అధికారులు బరితెగించారు. మే 15న పాల్వాయి గేట్ వద్ద వీఆర్ఓ గుర్తు తెలియని వ్యక్తులు పోలింగ్ బూత్ ను పగులగొట్టాడని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ లో ఉన్న పోలీసులు ఎవ్వరూ మాట్లాడలేదు.
కనీసం రాతపూర్వకంగా ఎమ్మెల్యే పేరు లేదు. పాల్వాయి గేట్ వద్ద పోలింగ్ ఏమైనా ఆగిందా..? లాక్ బుక్ లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం చివరి ఓటరు వేసేంత వరకు రిపెయిర్ వచ్చినా రాయాలి కదా..? 15వ తేదీన ఎఫ్ఐఆర్ కట్టారు. మిషన్ ధ్వంసం అయితే మే 13న ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు. ఎవ్వరి దగ్గర రికార్డు కాదు.. 13న ఫిర్యాదు చేయలేదు ఎందుకు చేయలేదు. ఎందుకు రిపోర్టు చేయలేదు. ఈవీఎంను ధ్వంసం చేశారని 15వ తేదీన ఫిర్యాదు చేశారు.