మూడు తరాల అక్కినేని “మనం”.. తండ్రీ కొడుకుల మద్య అనుబంధం.. ఎప్పటికీ శాశ్వతం

-

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినే కుటుంబానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కనీసం 5 వ తరగతి కూడా చదువుకోని అక్కినేని నాగేశ్వర రావు గారు తెలుగు చిత్ర పరిశ్రమలో మూల స్థంభం లా నిలబడ్డారు. నాగేశ్వర రావు సినిమాలలో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు చేసి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థీరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేని నాగశ్వర రావు ప్రతీ ఒక్కరికీ తన కష్టాన్నే నమ్ముకోమని అదే జీవితంలో అత్యున్నత స్థానానికి తీసుకు వస్తుందని సభా ముఖంగా చెప్పిన సందర్భాలు ఎన్నో. నిజ జీవితంలోనే కాదు సినిమా షూటింగ్స్ ప్రారంభంలో కాని ప్రతీ రోజు మేకప్ వేసుకున్నాక దేవుడి మీద తీయాల్సిన షాట్ విషయంలో గాని అసలు సెంటిమెంట్స్ ని నమ్మరు.. పాటించరు. ఇందుకు ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ గారు చెప్పిన సందర్భమే ఉదాహరణ.

ఇక నాగేశ్వర రావు అద్భుతం గా ఇంగ్లీష్ లో మాట్లాడతారంటే అది ఆయన కృషి. ఒకానొక సందర్భంలో పడ్డ అవమానం. మీకు ఇంగ్లీష్ అర్థం కాదు.. మాట్లాడటం రాదు అన్న వాళ్ళకి సున్నితంగా సమాధానం చెప్పి ఛాలెంజ్ చేసిన కొన్ని నెలల్లోనే ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడారు. అది చూసి షాకయిన వారు ఎంతో మంది. ఈ ఒక్క విషయంలో నే ఇంత పట్టుదల తాపత్రయం ఉందంటే హీరోగా సక్సస్ ఫుల్ నిర్మాతగా నంవర్ వన్ స్థానానికి చేరుకోవడానికి ఇంకెత పట్టుదలతో ఉండేవారో ఊహించుకోవచ్చు.

 

అదే వారసత్వాన్ని కొడుకులు నాగార్జున, వెంకట్ కొనసాగించారు. భార్య పేరు మీద అన్నపూర్ణ స్టూడియోని స్థాపించిన నాగేశ్వర రావు ఆ సంస్థలో ఎన్నో సూపర్ హిట్స్..ఇండస్ట్రీ రికార్డ్స్ ని సాధించారు. ఆ తర్వాత నాగార్జున, వెంకట్ కొనసాగిస్తున్నారు. నాగేశ్వర రావుకి నాగార్జున, వెంకట్ రెండు కళ్ళు లా ఉంటూ తల్లి దండ్రి బాధ్యతలతో పాటు స్టూడియో బాధ్యతలని సజావుగా నిర్వర్తిస్తున్నారు. చెప్పాలంటే ఈ తండ్రీ కొడుకుల మద్య ఉన్న అనుబంధం స్నేహ బంధం అని చెప్పాలి. నాగేశ్వర రావు .. నాగార్జున..వెంకట్ అలా అన్నపూర్ణస్టూడియో లో కబుర్లు చెప్పుకుంటు తిరుగుతంటే అక్కడ జరిగే షూటింగ్ సిబ్బందికి కాని మిగతా వారికి గాని చూడటానికి రెండు కళ్ళు చాలవు.

 

ఇప్పుడు అదే తండ్రీ కొడుకుల అనుబంధం నాగార్జున.. నాగ చైతన్య.. అఖిల్ ల మద్య సాగుతుండటం గొప్ప విశేషం. కింగ్ …మన్మధుడు అన్న పేర్లతో ఇండస్ట్రీలోనే కాదు అక్కినేని అభిమానుల్లో అసాధారణమైన క్రేజ్ ని సంపాదించుకున్న నాగార్జున తన కొడుకులతో ఎంతో స్నేహంగా మెలుగుతున్నారు. ఈ ముగ్గురిని చూస్తే ఏ ఒక్కరు వీళ్ళు తండ్రీ కొడులు అంటే నమ్మరు.

 

అందుకు ఉదాహరణ మనం సినిమాలోని కొన్ని సీన్స్ నే చెప్పొచ్చు. నాగేశ్వర రావు కి తన కొడుకులిద్దరు ఎలా రెండు కళ్ళ లాగా ఉన్నారో ఇప్పుడు నాగార్జున కి నాగ చైతన్య, అఖిల్ అలా ఉంటున్నారు. చెప్పాలంటే మనం సినిమా ఈ అక్కినేని కుటుంబం కోసమే సృష్ఠించబడిందని చెప్పాలి. ఈ సినిమాలో మూడు తరాల వాళ్ళని వెండి తేరమీద చూసిన ప్రేక్షకులకు పెద్ద పండగే.

Read more RELATED
Recommended to you

Latest news