ఎవరెస్టు ఎత్తు మారింది.. ప్రస్తుతం ఎంత ఉందో తెలుసా..!?

-

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటిది అనగానే అందరికి గుర్తుకు వచ్చే పర్వత్వం మౌంట్ ఎవరెస్ట్. అయితే తాజాగా ఈ శిఖరం ఎత్తు మారింది. అయితే తాజా లెక్కల ప్రకారం ఈ పర్వతం ఎత్తు 8848.86 మీటర్లు ఉందని తెలిపింది. నేపాల్, చైనా సంయుక్తంగా దీని ఎత్తును కొలిచి 8848.86 మీటర్లుగా నిర్ధారించాయి. 1954లో భారత్ కొలిచిన కొలత(8848 మీటర్లు) కంటే 86 సెంటిమీటర్లు అధికంగా ఉన్నట్లు మంగళవారం నాడు ప్రకటించాయి. 2015లో నేపాల్లో భూకంపం వచ్చినప్పటి నుంచి ఎవరెస్టు శిఖరం కచ్చితమైన ఎత్తును కొలవాలనే వాదనల వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

evarest
evarest

అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరమైన మౌంట్ ఎవరెస్టు నూతన ఎత్తు వచ్చేసి 8848.86 మీటర్లుగా చైనా, నేపాల్ ప్రకటించాయి. ఇందుకు సంబంధించి చైనాకు చెందిన జిన్హువా వార్తా సంస్థ తన నివేదికలో తెలిపింది. ఎవరెస్టు పర్వతం ఎత్తును 8848.86 మీటర్లు ఎత్తులో నేపాల్ తిరిగి లెక్కిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యవాలి ఖాట్మాండులో ప్రకటించారు.

ఇక చైనా సహకారంతో నిర్మించిన సర్వేల ద్వారా ఎవరెస్ట్ ఎత్తులో ఎలాంటి తరుగుదల చోటుచేసుకోలేదని వెల్లడైంది. ఎవరెస్ట్ శిఖరం తాజా ఎత్తు 8,848.86 మీటర్లు అని నేపాల్ ప్రభుత్వం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ పర్వతం ఎత్తును భారత ప్రభుత్వం 1954లో కొలిచినపుడు 8,848 మీటర్లు అని నిర్థరణ అయింది. ప్రపంచవ్యాప్తంగా దీనినే విస్తృతంగా ఆమోదిస్తున్నారు. తాజాగా నేపాల్‌ సర్వేలో ఎవరెస్ట్‌ ఎత్తు 0.86 మీటర్లు పెరిగిందని, ప్రస్తుతం దాని ఎత్తు 8,848.86 మీటర్లకు చేరిందని ప్రకటించాయి. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్, చైనా మంత్రి వాంగ్ యి వర్చువల్ కార్యక్రమంలో ఈ వివరాలను ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news