పిల్లలకి ఈపీఎఫ్ఓ నుంచి ప్రతీ నెలా పెన్షన్… ఈ పెన్షన్ రూల్స్ ఎవరికి వర్తిస్తాయంటే..?

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గురించి అందరికీ తెలుసు. అయితే పిల్లలకు కూడా పెన్షన్ లభిస్తుందన్న సంగతి చాలా మందికి తెలియదు. . EPS-95 ప్రకారం అనాథ పిల్లలకు కూడా పెన్షన్ లభిస్తుందని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. కరోనా మహమ్మారి వలన ఎన్నో ఇబ్బందులు వచ్చాయి.

మహమ్మారి కారణంగా చాలా మంది పిల్లలు అనాథలయ్యారు. అయితే తల్లిదండ్రులని కోల్పోవడం నిజంగా బాధాకరం. ఆ పిల్లలకు జీవనాధారం లేదు. అలాంటి అనాథ పిల్లలకు ఈపీఎఫ్ఓ ఓ ముఖ్యమైన విషయాన్ని చెప్పింది. ఈపీఎస్ మెంబర్స్‌గా ఉన్నవారి పిల్లలకు మాత్రమే ఈపీఎఫ్ఓ నుంచి ఆర్థిక సహకారం ఇస్తుంది అని ఈపీఎఫ్ఓ ప్రకటించింది.

ఇక ఆ రూల్స్ గురించి చూస్తే.. వితంతులకు వచ్చే మంత్లీ పెన్షన్‌లో 75 శాతం అనాథ పిల్లలకు లభిస్తుంది. కనీసం రూ.750 నుంచి పెన్షన్ వస్తుంది. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికీ నెలకు రూ.750 చొప్పున పెన్షన్ లభిస్తుంది. అనాథ పిల్లలు వారి వయస్సు 25 ఏళ్లు వచ్చే వరకు ఈ పెన్షన్ పొందొచ్చు. అదే ఒకవేళ అంగవైకల్యం, ఇతర శారీరక లోపాలు ఉంటే ఆ పిల్లలకి జీవితాంతం పెన్షన్ లభిస్తుంది.

ఉద్యోగి వేతనం నుంచి కంపెనీ డబ్బులు తీసుకోదు. కంపెనీ కంట్రిబ్యూషన్ నుంచి కొంత భాగం ఈపీఎస్‌లోకి వెళ్తుంది. కొత్త రూల్ ప్రకారం రూ.15,000 బేసిక్ వేతనం వరకు ఈ సదుపాయం పొందొచ్చు. ఈ రూల్ ప్రకారం వేతనంలో 8.33 శాతం ఈపీఎస్‌లోకి వెళ్తుంది. అంటే రూ.15,000 బేసిక్ వేతనం ఉంటే ఈపీఎస్‌లో రూ.1,250 జమ అవుతుంది. అలానే ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా ఈపీఎఫ్ మెంబర్ మరణిస్తే నామినీకి రూ.7 లక్షల వరకు బీమా లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news