అందరి ప్రశంసలు అవసరం.. అందుకే అలా అన్నా: విశ్వక్ సేన్

-

విద్యాధర్‌ దర్శకత్వంలో మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గామి.ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. అభినయ ,సమద్‌ మరియు హారిక ఒక కీలక పాత్రలో నటించారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే ఈ సినిమాకి 4 రోజుల్లో రూ. 9.53 కోట్లు షేర్‌తో పాటు రూ. 20 కోట్లు గ్రాస్ వచ్చింది.ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని హీరో విశ్వక్‌సేన్‌ తాజాగా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

తాను ఇండస్ట్రీలోని కొందరిని విమర్శించినట్లు వస్తోన్న వార్తలపై హీరో విశ్వక్సేన్ స్పందించారు. ‘ విడుదల ముందు సపోర్ట్ చేయమని అడిగితే లేపమని, సపోర్ట్ చేయమని. అదే మూవీ హిట్ అయ్యాక ప్రాఫిట్ జోను వచ్చాక చూడమంటే గుర్తించమని. నేను తప్ప ప్రతి టెక్నీషియన్ కొత్తవాళ్లే. వారికి మీ అందరి ప్రశంసలు అవసరం అంతే. నేను కోరుకుంది అదే. గామి తెలుగు చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది’ అని ట్విట్టర్(ఎక్స్) లో ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news