‘దేవర’ మూవీ ఫస్ట్ సాంగ్ విడుదల అయ్యేది అప్పుడేనా…?

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’.

ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.అయితే ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ విడుదల తేదీపై సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20వ తేదీన సాంగ్ రిలీజ్ చేసి అభిమానులలో జోష్ నింపుతారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘దేవర’ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా న‌టిస్తుంది విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌ల‌ను రిలీజ్ చేయ‌గా….. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.తారక్ ఈ మూవీ లో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news