ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చు.. అద్దంకి దయాకర్ సంచలన ఆరోపణలు

-

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఈవీఎంలు హ్యాక్ గురవుతున్నాయని అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవలే ఎలన్ మస్క్ ఈవీఎం లు హ్యాకింగ్‌కు గురవ్వడంపై ఎలాన్‌ మస్క్‌ EVMలను వ్యక్తులు లేదా AI సాయంతో హ్యాక్‌ చేసే ప్రమాదం ఉందని.. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుందని మస్క్‌ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో EVMలు తొలగిస్తేనే హ్యాకింగ్‌ను నివారించొచ్చు. వ్యక్తులు లేదా AI సాయంతో హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది.. అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఎలన్ మస్క్  వ్యాఖ్యలను సమర్థిస్తూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలపై మస్క్ వ్యాఖ్యలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. ఈసీ పనితీరుపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలన్నారు. ఉన్నత స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఈవీఎంల వల్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని అద్దంకి అన్నారు. టెక్నాలజీ మార్పు వల్ల ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version