గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరువ తీసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి మరణించిన వారి కుటుంబాలు పలు ఇబ్బందులకు గురి అవుతున్నాయి. దీంతో గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రూ.5లక్షల చొప్పున 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు.
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు ఎక్స్ గ్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనీల్ ఈరవత్రి చెప్పిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి సీఎం నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.