నేనేమైనా అంటారానివాడినా అంటూ వైసీపీపై అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో రూ.3 వేల కోట్లతో నీటిపారుదల పనులు జరుగుతున్నాయని.. నాపై విమర్శలు చేసిన వ్యక్తి నియోజకవర్గం లో రూ.1000 కోట్ల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. నెల్లూరు, సంగం బ్యారేజి పనులు దాదాపుగా పూర్తి అయ్యాయని వెల్లడించారు.
వచ్చే నెలలో ప్రారంభిస్తాం.. వయసు అయిపోయిన వారు చేసే మాటలను పట్టించుకోనని కకాణికి కౌంటర్ ఇచ్చాడు. ఆయన లాగా పార్టీలు మారలేదు.. నా నియోజకవర్గంలో అనధికారికంగా ఫ్లెక్సీలు వేయవద్దని ముందే చెప్పానని వెల్లడించారు. అందువల్లే కార్పొరేషన్ సిబ్బంది తొలగిస్తూన్నారని.. నా ఫ్లెక్సీలు కూడా వేడుకోవడం లేదన్నారు. నా బంధువుల సంవత్సరీకానికి సర్వేపల్లి కి వెళ్లానని.. దానిని కూడా రాజకీయం చేస్తున్నారని అగ్రహించారు. నేనేమైనా అంటారానివాడినా.. ఎక్కడికీ పోకూడడా… ఇదేం న్యాయమని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్.