ఏసీ వలన కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంటే ఇలా చెయ్యండి..!

-

వేసవికాలం అంటేనే ఎండలు మండిపోతాయి. దానికి తోడు వేడిగాలులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఇల్లు చల్లగా ఉంచుకోవడానికి మన దగ్గర ఉండే పరిష్కారం ఏసీ. ఏసీ వేసుకుంటే కాస్త చల్లగా ఉంటుంది. పైగా మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే వేసవికాలంలో ఏసీ బిల్లు ఎక్కువ అవుతుంది.

దాంతో ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువగా వస్తుంది. అయితే అలా కాకుండా కరెంట్ బిల్లు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇలా కనుక మీరు చేశారంటే ఏసి బిల్లు తగ్గుతుంది. మరి ఇక ఏసీ బిల్లు ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

సరైన టెంపరేచర్ వద్ద ఏసి ఉంచండి:

ఏసీని వేసుకునేటప్పుడు సరైన టెంపరేచర్ వద్ద ఉంచితే బిల్లు తక్కువగా వస్తుంది. 15 నుండి 16 డిగ్రీల వద్ద ఏసి ఉంచడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుందేమో కానీ బిల్లు ఎక్కువ వస్తుంది. అందుకనే మీ ఏసి 24 డిగ్రీల వద్ద సెట్ చేసుకోండి.

ఏసీలో టైమర్ సెట్ చేయండి:

ఒకసారి మనం రాత్రి పూట ఏసీ ని ఆపడం మర్చిపోతూ ఉంటాం. అందుకని మీరు ఏసీలో టైమర్ ని సెట్ చేయండి. దీనితో ఏసీ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది.

ఏసీ సర్వీసింగ్ చేయించండి:

ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించడం చాలా ముఖ్యం. సర్వీసింగ్ చేయించడం వల్ల కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది. ఏసీలో దుమ్ము పేరుకుపోతే సరిగ్గా పని చేయదు. అందుకనే సర్వీసింగ్ చేస్తే మంచిది.

పవర్ బటన్ ను ఆఫ్ చేయండి:

చాలా మందికి పవర్ బటన్ ని ఆఫ్ చేసే అలవాటు ఉండదు. రిమోట్ లో ఆఫ్ చేసి అలా వదిలేస్తారు. కానీ మెయిన్ స్విచ్ ని కూడా ఆపాలి అప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ రాదు. లేదంటే వాడకుండా బిల్లు అయిపోతుంది. అలానే మీరు ఏసి వేసినప్పుడు కిటికీలు తలుపులు తెరవకండి చిన్న గ్యాప్ కూడా లేకుండా తలుపుల్ని మూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news