వనస్థలిపురంలో మాజీ మంత్రి అనుచరుడి దౌర్జన్యం.. స్థలం కబ్జాకు యత్నం

-

హైదరాబాద్ మహానగరంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. పొలిటికల్ సపోర్టుతో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రధాన అనుచరుడు కొప్పుల వేనా రెడ్డి గుండాయిజం ప్రదర్శించారు.వనస్థలిపురం పీఎస్ పరిధిలోని చింతలకుంటలో గల 1,669 గజాల స్థలం చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేసి అడ్డువచ్చిన వారిపై దాడికి కొప్పుల వేనా రెడ్డికి సపోర్టుగా కిరాయి గుండాలు దాడికి యత్నించారు.

బాధితులు 100కు ఫోన్ చేయడంతో గుండాలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సాహెబ్ నగర్ రెవిన్యూ పరిధిలోని చింతలకుంట ఆగమయ్య నగర్ కాలనీలో సర్వే నెంబర్ 1p, 2p, 3p లో 1669 గజాల స్థలాన్ని కొప్పుల వేనా రెడ్డి కబ్జాకు యత్నిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు సైట్ వద్దకు వచ్చి గుండాలతో దౌర్జన్యం చేస్తున్నారని పీఎస్‌లో ల్యాండ్ ఓనర్ ఫిర్యాదు చేశాడు.మా కుటుంబానికి ఎప్పటికైనా ప్రాణహాని ఉందని తమ పిల్లల పేరుపై రిజిస్టేషన్ చేయించానని యాజమాని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news