గోషామహల్ నియోజకవర్గంలోని చాక్నవాడి నాలా మరోసారి కుంగింది.కుంగిన ప్రతీసారి అధికారులు మీద మీద మరమ్మత్తులు చేసి వెళ్లిపోతున్నారని.. కానీ అది మరల కుంగుతోందని వాహనదారులు, స్థానికులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్మినెంట్‌గా నాలాను రిపేర్ చేయాలని లేదా కొత్తగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ఆదివారం ఉదయం చాక్నవాడి మలుపు వద్ద ఇప్పటికే జరుగుతున్న నాలా పైకప్పు కూలిపోయింది.ఇప్పటికి ఆరుసార్లు నాలా కుంగింది. నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు వెళ్లిపోయిన తర్వాత ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. కాగా, ఇప్పటికైనా తమకు పర్మినెంట్ సొల్యూషన్ చూపాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
గోషామహల్‌లో మళ్లీ కుంగిన చాక్నవాడి నాలా
ఇప్పటికి ఆరుసార్లు కూలిన నాలా
చాక్నవాడి మలుపు వద్ద ఇప్పటికే జరుగుతున్న నాలా పైకప్పు నిర్మాణం పనులు
నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు వెళ్లిపోయిన తర్వాత జరిగిన ఘటన
కూలిన ప్రతి సారి అక్కడి వరకే మరమ్మతులు చేస్తున్న అధికారులు
నాలా… pic.twitter.com/DvBoMisIl2
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2025