ఏపీలోని గుంటూరు జిల్లాలో గల జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ సాధారణ వైద్యశాల(జీజీహెచ్)లో ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా కోర్సు చేస్తున్న కొందరు విద్యార్థినులు శిక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌లో పనిచేసే ఓ ఉద్యోగి వారి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
సదరు బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశాడని బాధిత విద్యార్థినులు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్ ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.కమిటీ నివేదిక ఆధారంగా బ్లడ్ బ్యాంక్ ఉద్యోగిపై తగిన చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్ పేర్కొనట్లు తెలిసింది.