పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ అన్నారు. బుధవారం సిద్ధిపేటలో ఎంఈఓ యాదవ రెడ్డి ఎసిసి లక్ష్మయ్యతో కలిసి అయిన మాట్లాడారు. 371 పాఠశాల నుండి బాలురు 7036 బాలికలు 6951 ఒక్కసారి ఫెయిల్ అయిన వారిలో బాలురు మూడు, బాలికలు మూడు చొప్పున మొత్తం 1398 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
ఈనెల 18 నుండి ఏప్రిల్ 2 వరకు జిల్లాలోని 80 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఏప్రిల్ ఒకటి రెండు తేదీల్లో 18 పరీక్ష కేంద్రాల్లో ఒకేషనల్ విద్యార్థుల బాలురు 790 మంది బాలికలు 871 మంది మొత్తం 1661 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.