పెచ్చుమీరిన ఖలీస్తానీ వాదం..కెనడాలో హిందువులపై దాడులు!

-

కెనడాలో ఖలీస్తాని వాదం పెచ్చుమీరుతోంది. తాజాగా హిందువులపై ఖలీస్తాని మద్దతు దారులు దాడులు చేశారు.బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిర్‌లో భక్తులపై ఖలిస్థానీలు దాడి చేయగా దీనిని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. దేశంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు తావులేదని పేర్కొన్నారు.ప్రతి దేశ పౌరుడు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందన్నారు.

హిందువులపై జరిగిన దాడి ఘటనపై విచారణ చేయడంలో శరవేగంగా స్పందించిన పోలీసులకు ధన్యవాదాలు అని తెలిపారు. కాగా, హిందువులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను కెనడాలోని స్థానికులు, ఎంపీలు సైతం సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఆలయం వెలుపల ఖలిస్థానీ ఫేవర్ గ్రూప్స్‌తో ఉన్న జెండాలు కనిపిస్తాయి.పిల్లలు, మహిళలపై ఖలీస్తానీ మద్దతుదారులు దాడి చేస్తున్నట్లు దృశ్యాలు కనిపిస్తాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news