కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వం అందిస్తున్న మైక్రో ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ను మరింత ప్రజలలోకి తీసుకు వెళ్లాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది..మోదీ సర్కార్ ప్రజల కోసం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా అనే రెండు మైక్రో ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటి ద్వారా పేద ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.. ఎన్నో ప్రయోజనాలను కూడా పొందవచ్చు..
ఈ స్కీమ్స్‌తో పాటుగా ముద్రా యోజన, స్టాండప్ ఇండియా స్కీమ్ వంటి వాటిని కూడా ప్రజలకు చేరువ చేయాలని మోదీ సర్కార్ ప్రభుత్వ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.. ప్రస్తుతం చాలా మంది ఏడాది ప్లాన్స్ ఎంచుకుంటున్నారు. అంటే ఏడాది వరకు ప్లాన్ ఉంటుంది. తర్వాత దాన్ని రెన్యూవల్ చేసుకుంటున్నారు. ఇలా చాలా మంది చేస్తున్నారు. అయితే ఏడాది కాకుండా ఎక్కువ టెన్యూర్‌తో పాలసీ తీసుకునేలా చూడాలని ప్రభుత్వం బ్యాంకులకు సూచించినట్లు తెలుస్తోంది..
ఇక విషయానికొస్తే..రూ. 456తో సామాన్యులు ఏకంగా రూ. 4 లక్షల వరకు బెనిఫిట్ పొందుతున్నారని చెప్పుకోవచ్చు. జీవన్ జ్యోతి బీమా యోజనలో 18 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వారు చేరొచ్చు. పథకంలో చేరిన వారు మరణిస్తే.. రూ. 2 లక్షల బీమా వస్తుంది..సురక్ష బీమా స్కీమ్‌లో అయితే ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. పాక్షిన అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష చెల్లిస్తారు. అంటే ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు…అయితే ఇందులోనే ఈ మైక్రో ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఏప్రిల్ 1 నుంచి కూడా వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బ్యాంకులు కొత్త కార్యక్రమాలను మొదలుపెట్టారు..