కాంగ్రెస్‌లో చేరిన కర్ణాటక మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ పార్టీలో టికెట్ల పంపిణీ అగ్గిరాజేసింది. టికెట్ ఆశించి భంగపడిన వారంతా బీజేపీకి షాక్ ఇస్తూ రాజీనామాల బాటపట్టారు. కొందరు వేరే పార్టీల్లో చేరుతున్నారు. పలువురు నేతలు పార్టీకి గుడ్​బై చెప్పి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.

ఇటీవలే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి రాజీనామా చేశారు. ఇక ఇవాళ కమలం పార్టికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్​లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జగదీశ్ ఆ పార్టీ చేయందుకున్నారు. అసెంబ్లీ సీటు నిరాకరణతోనే జగదీశ్ ఆ బీజేపీకి రాజీనామా చేశారు.

వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్బళ్లి- ధార్వాడ నుంచి పోటీచేసేందుకు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌కు బీజేపీ ఈసారి అవకాశం కల్పించలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన.. ఎంతో సేవ చేసిన తనను కరివేపాకులా తీసిపాడేశారంటూ పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version