మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్… అందరిలోనూ ఉత్కంఠ

-

దేశవ్యాప్తంగా దాదాపు ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలబడునున్నాయి. పలు సర్వే సంస్థలు, వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల ద్వారా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించనున్నాయి.లోక్‌సభ ఎన్నికలతోపాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి.

దేశంలోని ప్రజలు కేంద్రంలో ఏ పార్టీకి పట్టం కట్టనున్నాడనేది ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా కాస్తా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లోని ఓటరు.. గత ప్రభుత్వాన్ని కొనసాగింపుగా ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఓటు వేశాడా? లేకుంటే ప్రతిపక్ష పార్టీకి ఓటు వేసి.. అధికారంలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడా? అనేది కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరిగాయి. ఏప్రిల్ 19న మొదలైన తొలి దశ పోలింగ్.. జూన్ 1వ తేదీతో పోలింగ్ ముగిసింది.

Read more RELATED
Recommended to you

Latest news