ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మూడు రోజుల వైన్స్ బంద్

-

ఆంధ్రప్రదేశ్ లో మే 13న లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలకు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పలు కూటమి నేతలు.. అధికార వైసీపీ నేతల మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈవీఎంలు ధ్వంసం చేయడం.. పెట్రోల్ బాంబులు విసరడం ఇలా రచ్చ జరిగింది.

ఈ నేపథ్యంలో జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది. ఏపీలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మందు బాబులకు బిగ్ షాక్ తలిగిందనే చెప్పాలి. జూన్ 03వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మద్యం షాపులు మూసివేయాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాలు జారీ చేసారు. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేందుకే వైన్ షాపులు బంద్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. తమ ఆదేశాలను ధిక్కరిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు చెప్పారు. కేవలం అనుమతి ఉన్న వారు మాత్రమే కౌంటింగ్ కేంద్రాల వద్దకు రావాలని.. ఇతరులు రావద్దని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news