తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ విస్తరిస్తుంది. చాప కింద నీరులా ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుంది. ప్రతి రోజు ఓమిక్రాన్ కేసుల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 3 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో వచ్చిన ఓమిక్రాన్ కేసుల సంఖ్య 41 కి చేరాయని తెలిపారు. రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకోవాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. అయితే క్రిస్మస్ తో పాటు న్యూయర్ కూడా రావడంతో రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి కే రాష్ట్రంలో జనవరి 2 తేదీ వరకు ఆంక్షలు విధిస్తు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే క్రిస్మస్ తో పాటు న్యూయర్ వేడుకలకు ప్రజలు దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది.