తెలంగాణలో కొత్త‌గా 140 క‌రోనా కేసులు, 2 మ‌ర‌ణాలు న‌మోదు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ట్లు అర్థ‌మౌవుతుంది. తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా.. 140 క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు న‌మోద‌య్యాయి. అలాగే.. నిన్న ఒక్క రోజులో.. కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హమ్మారి కేసుల సంఖ్య 6,80,553 కు చేరింది. అలాగే… క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,021 కు చేరింది.

ఇక ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,499 గా న‌మోదు అయింది. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో 186 క‌రోనా నుంచి కోలు కోగా… మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 6,73,033 గా న‌మోదు అయింది.

అలాగే.. గ‌డిచిన 24 గంట‌ల్లో.. 26,947 క‌రోనా ప‌రీక్ష‌లు చేసింది తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ‌. దీంతో మొత్తం క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య 2,94,95,891 కు చేరింది. ఇక తెలంగాణ లో ఇప్పటివరకు 41 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ కొత్త‌గా 3 ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version