పశ్చిమ బెంగాల్ లో ఘోరం.. బాణసంచా కర్మాగారంలో పేలుడు… ఆరుగురు  మృతి

-

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర 24 పరగాణా జిల్లాలో పటాకుల తయారీలో ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. కోల్ కతాకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలోని దత్తపుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీల్ గంజ్ లోని మోష్ లోని బాణాసంచా కర్మాగారంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ మంటలు చెలరేగి ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను ట్రీట్ మెంట్ కోసం సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. ఈ  పేలుడుకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు అధికారులు. గత నాలుగు నెలల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది రెండో సారి. మే నెలలో పుర్బా మేదినీ పూర్ జిల్లా ఎగ్రాలో బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 12 మంది మరణించిన విషయం తెలిసిందే. 

Read more RELATED
Recommended to you

Exit mobile version