ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ నుంచి భారత్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని మోడీ గ్లోబల్ ఎన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్, ఎక్స్‌పో రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ సదస్సుకు హాజరయ్యారు. అయితే, ఎక్స్ పో ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ..చంద్రబాబు అప్యాయంగా పలకించారు.
చంద్రబాబుతో చేయి కలిపి కాసేపు ముచ్చటించారు. వీరి సంభాషణను అక్కడున్న వారంతా ఆసక్తిగా గమనించారు.ఈ వేడుకకు గుజరాత్ సీఎం సహా పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖ వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఇదిలాఉండగా, ఎన్డీయే కూటమిలో భాగమైన చంద్రబాబుకు కేంద్రం నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రానికి మెజార్టీ సీట్లు తగ్గడంతో చంద్రబాబు సపోర్టుతో మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.