ఆంధ్ర ప్రదేశ్ లో వేసవి సెలవులు పొడిగింపు

-

రాష్ట్రంలో వేసవి సెలవులను ఈనెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండగా తాజా మార్పుతో 13న రీఓపెన్ అవుతాయని తెలిపింది. 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరోరోజు పొడిగించింది.

కాగా, ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో పాటు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నారు. కేసరపల్లి, గన్నవరం పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news