కంటి ఆరోగ్యం బాగుండాలంటే వీటిని మరచిపోకండి..!

-

ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తున్నాయి. కంటి ఆరోగ్యం చాలా ముఖ్యం. కంటి ఆరోగ్యం బాగుండాలంటే తీసుకునే ఆహారం కూడా బాగుండాలి. అయితే కంటి ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూసేయండి.

విటమిన్ ఏ:

విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్-ఏ లోపం కనుక ఉంటే కళ్లు కనిపించకపోవడం మొదలైన సమస్యలు వస్తాయి. విటమిన్ ఏ కనుక తీసుకున్నట్లయితే రేచీకటి, డ్రై ఐ వంటి సమస్యలు కలుగుతాయి. ఎక్కువగా పసుపురంగు పండ్లలో విటమిన్ ఏ ఉంటుంది అలాగే కూరగాయలలో కూడా విటమిన్ ఏ ఉంటుంది. కనుక వీటిని మీ డైట్ లో ఎక్కువగా తీసుకోవడం మంచిది.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

స్టడీస్ ప్రకారం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎక్కువగా ఇది చేప, గింజలు, సాల్మన్ మొదలైన వాటిలో మనకు దొరుకుతుంది. కనుక వీటిని కూడా డైట్ లో తప్పకుండా తీసుకోండి.

విటమిన్ సి :

కంటి ఆరోగ్యానికి విటమిన్ సి కూడా చాలా అవసరం. విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోవడం లేదా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా క్యాప్సికమ్, సిట్రస్ ఫ్రూట్స్, జామకాయ, నిమ్మ, బ్రోకలీ, కమలాలు తీసుకోవాలి.

విటమిన్ ఈ:

విటమిన్ ఈ కూడా చాలా అవసరం. ఎక్కువగా ఇది బాదం, సన్ ఫ్లవర్ సీడ్స్, ఫ్లేక్ సీడ్స్ లో ఇది ఎక్కువగా ఉంటుంది. కనుక డైట్ లో రెగ్యులర్ గా ఈ ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండండి కంటి సమస్యలకు దూరంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news